మయన్మార్‌లో మళ్లీమారణహోమం

90 మంది మృతి.. అధికార లెక్కల్లో 56

రహెంగ్యా తెగపై మళ్లీ ఊచకోత

నోరు విప్పని ప్రపంచ పెద్ద పోలీస్‌ అమెరికా

బర్మ : మళ్లీ మారణహోమం…మానవత్వం తల దించుకొనేలా మనిషిని మనిషే చంపుకొనే దారుణమారణ కాండ…అదే విద్వేషం..ముస్లిం ఐతే చాలు చంపేయడం..తీవ్రంగా హింసించి ఆనందించే మయన్మార్‌ సైనిక పాలకుల పైశాచికత్వం మళ్లీ జడలు విచ్చుకొంది…నాగరిక ప్రపంచం తల దించుకొనేలా తమ మారణకాండను కొనసాగిస్తూనే ఉన్నారు మయన్మార్‌ పాలకులు..గత కొద్ది రోజులుగా ముస్లింలపై విచ్చలవిడిగా దాడులు చేస్తూ చంపుతున్న అక్కడి పాలకులు మరోసారి తమ నెత్తుటి హోమాన్ని కొనసాగించారు..తమవి కాకపోతే చాలు ఇంకెవరి ప్రాణాలైతే మాకేం అన్నట్లుగా, వాళ్లవి ప్రాణాలే కావన్నట్లుగా వందలాదిగా రోహింగ్యా తెగ ముస్లింలను ఊచకోత కోస్తున్న బర్మా నియంతృత్వ పాలకులు మళ్లీ అదే దారుణానికి ఒడిగట్టారు. పైగా ఈ దారుణానికి మీరే కారణ మంటూ కర్కశంగా నెపాన్ని రోహింగ్యా తెగ ముస్లింలపైకి నెట్టేశి చేతులెత్తాశారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ దారుణ మారణకాండను పట్టించుకోని ప్రపంచ మీడియా అసలు అది సమస్యే కాదన్నట్లుగా వ్యవహ రించాయి…గత ఆదివారం నుండి ఇప్పటి వరకూ కనీసం 90 వరకూ మంది మరణించగా, అధికారిక లెక్కల ప్రకారం అది 56గా ఉంది..అయితే తొలిసారిగా బీబీసీ ఈ సంఘటనలను ప్రపంచానికి చాటింది. మయన్మార్‌లోమారణ హోమం జరుగు తోందం టూ ‘నాగరిక’ సమాజానికి వెల్లడించింది..రాకీన్‌ స్టేట్‌లో

బుద్దిస్ట్‌లు, రోహింగ్యా తెగ ముస్లీంల మధ్య ఘర్షణాపూరిత వాతావరణం నెలకొం దంటూ పేర్కొంది..ఈ ఘర్షణల్లో అధికారిక లెక్కల ప్రకారం 56 మంది చనిపోయారంటూ వెల్లడించింది..దీంతో గత కొద్దిరోజులుగా మయన్మార్‌లో జరుగుతన్న ఊచకోతను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చింది.. వేలాది మంది రోహింగ్యా తెగ ముస్లింలు హింసిం చబడుతున్నారని పేర్కొంది..   జూన్‌లో 90 మంది చనిపోయిన ఘటన తర్వాత ఇదే పెద్దదని చెప్పింది..దీనిపై అధికారులు ఆగస్టులో బర్మా అధికారులు విచారణకు కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది..అయితే ఈ ఊచకోతపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసి, విచారణకు ప్రతినిధులను పంపిస్తామని చెప్పగా మయన్మార్‌ అధికారులు అనుమతివ్వలేదు… అయితే అవకాశం దొరికినప్పడల్లా ముస్లీంలపై విద్వేషాన్ని చాటే అమెరికా ఇంత జరుగుతున్నా నోరు విప్పకపోవడం కొసమెరుపు..