దందాలకు కాలం చెల్లింది
` ఏప్రిల్‌లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
` రాజకీయాల ముసుగులో అరాచకాలు చేస్తే సహించేదిలేదు
` అధికారం లేని విÖరు అభివద్ధి ఎలా చేస్తారు?
` బెదిరింపులకు దిగితే భయపడం
` ఎన్నికల ప్రచార సభలో మంత్రి పొంగులేటి
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 09:(జనంసాక్షి): రాజకీయాల ముసుగులో అరాచకాలు చేస్తామన్నా… ఫోన్లలో బెదిరింపులకు దిగినా సహించేది లేదు. 11వ తేదీ ఎన్నికలు ముగియనివ్వండి.. హద్దులు దాటిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తా. చందాలు, దందాలు చేస్తే కింద పడుద్ది జాగ్రత్త! తింగరి వేషాలు వేస్తే ఊరుకోం.. చట్టప్రకారం విÖ అందరినీ బొక్కలో వేయించడం ఖాయం” అని తెలంగాణ రెవెన్యూ, గహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యర్థులను హెచ్చరించారు. ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం నిర్వహించిన కార్నర్ విÖటింగ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు.ప్రచార పర్వంలో ప్రత్యర్థుల తీరుపై మంత్రి నిప్పులు చెరిగారు. “ఎవరైనా కారుకూతలు కూస్తే చట్టరీత్యా ఉక్కుపాదం మోపుతాం. విÖ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. విÖ దందాలకు, దౌర్జన్యాలకు ప్రజలు ఈ ఎన్నికలతో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి.. అశాంతి సష్టించాలని చూస్తే ఉక్కుపాదం మోపుతాం” అని స్పష్టం చేశారు.రంగురంగుల కండువాలు వేసుకుని వస్తున్న నాయకులను మంత్రి సూటిగా నిలదీశారు. “అభివద్ధి చేయాలంటే ప్రభుత్వ సాయం ఉండాలి. అధికారంలో ఉన్న మేమే పనులు చేయగలం. ఏ అధికారం ఉందని విÖరు మేలు చేస్తామంటూ ప్రజల వద్దకు వస్తున్నారు? పదేళ్లు అధికారంలో ఉన్న ఆ ‘దొర’లకు పేదలకు ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేదు” అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే కొత్త రేషన్ కార్డులు, హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు వంటి ఎన్నో సంక్షేమ ఫలాలను అందించామని గుర్తుచేశారు. వచ్చే ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపడతామని మంత్రి ప్రకటించారు. “ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకున్న పేదలకు పట్టాలు ఇచ్చే బాధ్యత నాదే. ఏదులాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా” అని హావిÖ ఇచ్చారు. మున్నేరు వరద బాధితులకు అండగా ఉన్నామని, వచ్చే వర్షాకాలం నాటికి రిటైనింగ్ వాల్ పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. సభ అనంతరం వరంగల్ క్రాస్ రోడ్డు నుంచి నాయుడు పేట సర్కిల్ వరకు వేలాది మందితో జరిగిన భారీ ర్యాలీలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.


