మే 3న నీట్
` ఫిబ్రవరి 8 నుంచి మార్చి 9వరకు దరఖాస్తులు స్వీకరణ
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది.
న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పరీక్షను మే 3న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం ప్రకటించింది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 9వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థి గుర్తింపు వెరిఫికేషన్ కోసం ఆధార్ ఆధారిత ఈకేవైసీని ప్రవేశపెట్టారు. లైవ్‌ఫొటో: ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించే సమయంలో లైవ్ ఫొటో క్యాప్చర్ చేయడం తప్పనిసరి. తద్వారా సిస్టమ్ విÖ లైవ్ ఫొటోని ఆటోమేటిక్‌గా ఆధార్‌తో సరిపోల్చుతుంది. ఒకవేళ విÖ లైవ్ ఫొటో ఆధార్‌తో సరిపోలకపోతే.. అందుకు వీలుగా విÖ గుర్తింపును నిర్ధారించేలా తగిన ధ్రువీకరణపత్రాలను అదనంగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సిటీ సెలక్షన్: అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంలో అందించిన ప్రస్తుత/శాశ్వత అడ్రస్ ఆధారంగానే పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.1700 కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ`ఎన్‌సీఎల్ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 3న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎసఎంఎస్, బీయూఎంఎస్, బీహెచఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏవైనా సందేహాలు ఉంటే 011`40759000, 011`69227700 ఫోన్ నంబర్లు లేదా నివవబిబీణ2026ఏనిబిజీ.జీఞ.తిని ఈ`మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని ఎన్‌టీఏ అధికారులు సూచించారు. పరీక్ష సరళి, సిలబస్, ఇతర పూర్తి వివరాలతో కూడిన బుక్‌లెట్ కోసం క్లిక్ చేయండి.


