ఎన్నికలకు ఒకరోజు ముందు అనూహ్య ఘటన
` మక్తల్ ఆరోవార్డు అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య
` ఘటనకు కాంగ్రెస్ కారణమని మండిపడ్డ బీజేపీ
` పార్లమెంటులో ప్రస్తావించిన కిషన్ రెడ్డి, లక్క్ష్మణ్
` డీజీపీ ఆఫీస్ ముట్టడికి బిజెపి శ్రేణుల యత్నంతో ఉద్రిక్తత
మక్తల్(జనంసాక్షి):ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా ముగిసి..ఎన్నికలకు ఒకరోజు ముందు అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో ఆరో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున బిజెపి అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున నారాయణపేట జిల్లా మక్తల్‌లో జరిగింది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల మేరకు . మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎస్టీలకు రిజర్వు కావడంతో ప్రధాన పార్టీలు ముగ్గురు సొంత అన్నదమ్ములనే రంగంలోకి దించాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ నుండి మహదేవ్ (43), కాంగ్రెస్ నుంచి అతడి అన్న పోటీలో ఉండగా.. బిఆరఎస్ నుంచి పోటీ చేసిన వారి తమ్ముడు నామినేషన్ ఉపసంహరణ రోజున పోటీ నుంచి తప్ప్పుకున్నాడు. పోటీలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అయితే, నిన్నటి నుంచి డబ్బు, మద్యం పంపిణీ జరుగుతుండడంతో.. 6వ వార్డులోనూ పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులు కోరినట్లుగా సమాచారం. తాను లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేయగలను.. మిగతాది తన వల్ల కాదని సోమవారం పార్టీ శ్రేణులకు ఆయన తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన మహదేవప్ప ఈరోజు తెల్లవారుజామున తన ఇంట్లో ఉరేసుకొని మతి చెందాడు. మహదేవప్ప ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి కావడంతో ఆ వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మహదేవ్ మతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రత్యర్థుల వేధింపులతోనే మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. ఇందుకు నిరసనగా బిజెపి భగ్గుమంది. ప్రత్యర్థుల వేధింపుల వల్లనే మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించింది. సిఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ కిడ్నాప్‌లకు, బెదరింపులకు పాల్పడిందని ఆరోపిస్తూ…నిరసనగా హైదరాబాద్ డీజీపీ కార్యాలయ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో లక్డీకపూల్ లోని డీజీపీ కార్యాలయం ముందు భారీగా పోలీసులు భారీగా మోహరించారు. ఇకపోతే లోక్‌సభలో కిషన్ రెడ్డి, రాజ్యసభలో డాక్టర్ లక్క్ష్మణ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. సిఎం రేవంత్ రెడ్డి బెదరింపులకు పాల్పడుతున్నారని, ప్రత్యర్థులు భయంతో వణికేలా చేస్తున్నారని రాజ్యసభలో లక్క్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని లోక్‌సభలో కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇక హైదరాబాద్‌లో డిజిపి ఆఫీస్ ముందు బిజెపి ఆందోళనకు దిగింది. మహదేవప్ప మతితో బిజెపి శ్రేణులు భారీగా తరలివచ్చి డీజీపీ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ డీజీపీ ఆఫీసు ముట్టడికి యత్నించింది. దీంతో లక్డీకపూల్ లోని డీజీపీ ఆఫీసు దగ్గరకు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. డీజీపీ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించారు. బారికేడ్లు దూకేందుకు యత్నించారు.దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు. పలవురిని అరెస్ట్ చేశారు. ªSష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనుండగా.. మక్తల్ మున్సిపాలిటీలో 6 వార్డ్ బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. మహదేవప్ప మతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రత్యర్థుల వేధింపులతోనే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ఒక్క రోజు ముందే అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు.
మహదేవప్ప ఆత్మహత్యపై విచారణ చేయాలి
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, గిరిజన బిడ్డ ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకొవడం తీవ్ర కలకలంగా మారింది. మాఫియా రాజకీయాలు, అహంకార ధోరణి తట్టుకోలేకే మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆత్మహత్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు స్పందించారు. మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని, మహదేవప్ప కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపి డికె అరుణతో కలసి వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయించాలన్నారు. ఆత్మహత్యకు వేధింపులే కారణమని అన్నారు. ఇదిలావుంటే మహదేవప్పది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ చేసిన హత్య అని ఎంపి డికె అరుణ మండిపడ్డారు. ’ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతోంది. మా సహనాన్ని పిరికితనంగా భావిస్తారా?. ఎన్నికల తరువాత కాంగ్రెస్‌పై యుద్దం చేయబోతున్నాం. బీఆరఎస్ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్తాపితం చేసే రోజులొచ్చాయి. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలి. నిష్పాక్షికంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షాంచాలని ఆమె డిమాండ్ చేశారు.


