ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు వేతనాలు పెంచాలి

ఫిబ్రవరి 10 జనం సాక్షిజాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు జీవో నంబర్ 60 ప్రకారం రూ.15వేల జీతాన్ని పెంచి వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప కార్యదర్శి ఎం నరసింహ, కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్‌ఖన్నా డిమాండ్ చేశారు. సోమవారం సంఘాల ఆధ్వర్యంలో కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కా ర్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కమిషనర్‌కు వినతిపత్రం అందించగా, సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.


