పుర,నగర పోరుకు సర్వం సిద్ధం
` తెలంగాణలో నేడు మున్సిపల్ ఎన్నికలు
` 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్
` భారీగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
` అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసుల భద్రత
` మక్తల్ ఆరోవార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక వాయిదా
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరుగ నున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే…నారాయణపేట్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఆరోవార్డు ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవ్ ఆత్మహత్యతో ఎన్నికను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఎన్నికలకు ఒక్క రోజు ముందే అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే ఎన్నికల సిబ్బంది తమ సరంజామాతో తమకు కేటాయించిన బూతలకు చేరుకున్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం పోలింగ్ జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ పక్రియ ప్రారంభంకానున్నది. సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపుతో ఫలితాలు వెల్లడికానున్నాయి.. ఆ రోజే నగర, పట్టణ ప్రజానీకం ఎవరి వైపు మొగ్గు చూపిందనే ఉతంఠకు తెరపడనున్నది. జిల్లాలవారీగా ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు మంగళవారం తరలించారు. ఎన్నికల సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన కేంద్రాలకు వాహనాల్లో వెళ్లారు. ఎన్నికలు జరిగే పురపాలికల్లో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు.బ్యాలెట్ బాక్సులు, పత్రాలను పోలీస్ భద్రత నడుమ స్టాంగ్ రూమ్‌ల నుంచి రాష్ట్రంలోని డిస్టిబ్యూషన్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు తరలించారు. అక్కడి నుంచి మంగళవారం ప్రతి పోలింగ్ కేంద్రానికి తరలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అకడ సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గు ర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. 11న జరుగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సవిÖక్షించారు. పోలింగ్ పక్రియ కోసం సిబ్బంది నియామకం, వారికి అందించిన శిక్షణపై సవిÖక్షించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డిజపి కూడా పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.


