ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం

 

 

 

 

 

 

 

 

 

మంథని, (జనంసాక్షి) :

మున్సిపాలిటీలతో పాటు కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ల పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం — రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కైవసం
— రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని రాష్ట ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం మంథని నుండి హైదరాబాద్ వెళ్తున్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కమాన్ పూర్ క్రాస్ రోడ్డు వద్ద ఆగి అక్కడ ఉన్న ప్రజలను ఆప్యాయంగా పలకరించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని మున్సిపాలిటీలతో పాటు కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ల పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడంతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీని పట్టణ ప్రజలు సైతం తమ ఓటు ద్వారా ఆశీర్వాదాలు అందిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక మున్సిపల్ చైర్మన్ లను కార్పొరేషన్ చైర్మన్ లను వైస్ చైర్మన్ లను దక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.