మరో ప్రమంచ రీకార్డ్‌ సిద్దమవుతున్న దీనాజ్‌ వెర్వత్‌వాలా

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 15న హైదరాబాద్‌ నెక్లస్‌రోడ్డులో సుధీర్ఘ ఏరోబిక్‌ విన్యాసాలు నిర్వహించనున్నట్లు ప్రముఖ ఏరోబిక్‌ నిపుణులు దీనాజ్‌ వెర్వత్‌వాలా వెల్లడించారు. 26గంటల బాలీవుడ్‌ డాన్స్‌ ఏరోబిక్స్‌తో గిన్నిస్‌ బుక్‌లో మరోసారి స్థానం సాధించాలనే తపనతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రజల్లో ఆరోగ్యం ధ్రుఢత్వంపై మరింత అవగాహన కల్పించాలనేది తమ లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నృత్యం అంటే నాకు చాలా ఇష్టం అని ఒలంపిక్‌ విజేత సైనా నెహ్వాల్‌ , బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, మిసెస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ మొదటి రన్నరప్‌ రీతూ సాహూ, కశ్యప్‌ పాల్గోన్నారు.