మరో 48 గంటల్లో వర్షాలు!

హైదరాబాద్‌, జూన్‌ 9 :

మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో చల్లటి గాలులు వీస్తాయని, అక్కడక్కడ వర్షం కురుస్తుందన్నారు. రుతుపవనాల ప్రభావం తొలుత రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో కన్పించే అవకాశం ఉందని తెలిపారు. ఉష్ణోగ్రతలు శనివారంనాడు స్వల్పంగా తగ్గాయని చెప్పారు.