మహానగరానికి డర్టీ అండ్‌ డెబ్రి అవార్డ్‌ వచ్చే అవాకాశం ఉంది:కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌:రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఈ రోజు జన్‌సంఘ్‌ అనే స్వచ్ఛద సంస్థ నిర్వహించిన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమంలో పాల్లొన్న ఆయన ఉస్మానియా ప్రధాన ద్వారం నుంచి శివం గుడి వరకు ఆయన రోడ్లను వూడ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మజ్లీస్‌ సంయుక్తంగా జీహెచ్‌ఎంసీని నడుపుతూ నగరాన్ని భ్రష్ఠు పట్టించారాని ఎద్దేవ చేశారు. నగరానికి డర్టీ అండ్‌ డెబ్రి అవార్డ్‌ వచ్చే అవాకాశం ఉందని వ్యంగంగా అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులను అభినంధించారు. రోడ్లు వూడ్చే వారిని అందరం గౌరవించాలని వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.