మహా సభలను విజయవంతం చేయాలి

కడప, జూలై 10 : జిల్లాలో మున్సిపల్‌ వర్క్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా తృతీయ మహా సభలను కార్మికులు విజయవంతం చేయాలని యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు సిద్ధిరామయ్య పిలుపునిచ్చారు. పొద్దుటూరులో ఈ నెల 18వ తేదీన ఈ మహా సభలు జరుగుతాయని చెప్పారు. ఆ రోజు పొద్దుటూరు సీఐటీయూ కార్యాలయం నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. ఆ తర్వాత బహిరంగ సభ జరుగుతుంని చెప్పారు. జిల్లాలోని కార్మికులందరూ ఈ మహా సభల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మహా సభల్లో కార్మికుల సమస్యలపై భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని ఆయన చెప్పారు.