మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ను నియమించాలి

హైదరబాద్‌: మహిళ కమిషన్‌కు వెంటనే ఛైర్‌పర్సన్‌ను నియమించాలని డిమాండ్‌ చేస్తూ మహిళలు హైదరబాద్‌లో ధర్నా నిర్వహించారు. ఇందిరాపార్కు వద్ద ప్రగతిశీల మహిళ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో వివిధ జిల్లాల మహిళ సంఘాల నాయకులు పాల్గోన్నారు.మహిళలపై దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా అందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.