మానవ మనుగడకు చెట్లే ప్రాణాధారం జిల్లా కలెక్టర్‌

కర్నూలు, జూలై 31 : మానవ మనుగుడకు చెట ప్రాణాధారమని, సమాజంలోని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్‌ సి. సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నగర పరిసరాల్లోని విజయవనంలో 63వ వనమహోత్సవం సందర్భంగా కలెక్టర్‌ మొక్కలు నాటారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే కె రాంభూపాల్‌ రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, కంజర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టర్‌ శాంతిప్రియ పాండే, డిఎఫ్‌ఒలు రామకృష్ణ, నరసింహులు, రిటైర్‌ ్డ డిఎఫ్‌ఒ మల్లప్ప, డి.పి.ఆర్‌.ఓ పి. తిమ్మప్ప, కె. రామలింగారెడ్డి స్కూల్‌ అధినేత జనార్ధన్‌ రెడ్డి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్ల విస్తీర్ణంలో చెట్టను తీసివేయడం జరుగుతున్నదని వాటి స్థానంలో మరికొన్ని చెట్ల మొక్కలను నాటి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే కె.రాంభూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ వర్షాలు రావడానికి చెట్లు తోడ్పడుతాయని అన్నారు. కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో గృహాలు నిర్మించుకొనే వారికి చెట్లు పెంచుతేనే గృహ నిర్మాణానికి అనుమతివ్వాలని ఆయన కలెక్టరును కోరారు. 1950లో సంవత్సరంలోనే వనమహోత్సవం ప్రారంభించడం జరిగిందని అన్నారు. పచ్చదనం కల్పించేందుకు ప్రతి సంవత్సరం వనమహోత్సవం జరుపుకోవడంతో మంచి కార్యాక్రమమని శాంతి ప్రియ అన్నారు. జిల్లాలో కేవలం 19.5శాతం అడవులు మాత్రమే వున్నాయని, అవి తరిగిపోకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. వనమహోత్సవ సందర్భంగా విద్యార్ధులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. అత్యంత ప్రతిభ కనబరచిన విద్యార్థులకు కలెక్టర్‌ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.ఆర్‌.బి రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు, శాంతిప్రియ పాండే, డిఎఫ్‌ఒలు రామకృష్ణ, నరసింహులు, విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.