మార్చ్‌కు అనుమతించాలి
హైదరాబాద్: శాంతియుతంగా నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కును గౌరవిస్తూ మార్చ్‌కు అనుమతించాలని తెలంగాణ కో ఆర్డీనేషన్ కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అధికారంలోకి రావడానికి పార్టీలు ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయనప్పుడు ప్రభుత్వాలు నిలదీసే హక్కు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిందని కమిటీ చైర్మన్ గోపాల్‌కిషన్ అన్నారు.



