మా సర్కారు కూల్చేందుకు కుట్ర జరిగింది
– చంద్రబాబుతో చేతులు కలిపిన భట్టివిక్రమార్క
– ఎంఐఎం కుట్రను భగ్నం చేసింది
– మిత్రుడు అసద్ ఆదుకున్నాడు
– సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
– టీఆర్‌ఎస్ గూటికి చేరిన గుత్తా, వివేక్, వినోద్, రవీంద్ర
హైదరాబాద్,జూన్ 15(జనంసాక్షి):తెలంగాణ సర్కారు ను కుల్చేందుకు కుట్రలు చాల జరిగాయని సీఎం కే. చంద్ర శేఖర్‌రావు అన్నారు చంద్ర బాబు మాట్లాడిండు. బెర్లిన్ గోడ కూలగొట్టినట్టు.. మళ్లీ ఆంధ్రా తెలంగాణలను ఏకం చేస్తామన్నాడు. ఇవాళ్టి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క కూడా కుట్రలు చేశాడు. మిత్రుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నాకు మద్దతిస్తానని దారు సలాంలోని తన పార్టీ ఆఫీసులో తీర్మానం చేశారు. మా సర్కారుకు అసద్ మద్దతు ప్రకటించారు , ఆదుకొన్నారు . కుట్రలు జరుగుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. తెలంగాణ ఏర్పడొద్దని? ఏర్పడితే బతకనీయొద్దని కుట్ర చేశారు. అన్ని పార్టీలు కుట్ర చేసినవే” అన్నారు సీఎం.చరిత్రలో చూడని విజయాలు అందుకుంటున్నామని.. కుట్రలను ఛేదించడానికి ఏం చేయడానికైనా మొహమాట పడటం లేదని విపక్షాలకు సీఎం కేసీఆర్ సూటిగా. చెప్పారుబుధవారం టీఆర్‌ఎస్ భవన్ లో కాంగ్రెస్ నేతల చేరిక ఘణంగా గా జరిగింది. గులాబీ కండువాలు కప్పి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యేలు రవీంద్రనాయక్, భాస్కర్ రావులను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. ”పిడికెడు మందితో ఉద్యమం ప్రారంభించాను. ఎన్నో ప్రయాసలతో తెలంగాణ సాధించాము. నేను చావలేదు? తెలంగాణ వచ్చింది. అందరం కలిసి కొట్లాడాలని చెప్పి అన్ని పార్టీలు కలిసి జేఏసీ ఏర్పాటు చేశాం. రాజీనామాలు చేయాలని ముందుకు వచ్చాం. టీఆర్‌ఎస్ చేసింది. మిగిలిన పార్టీలు చేయలేదు. రాజీనామాలు చేయకుండా మాపై పోటీకి వచ్చారు. ఆ తర్వాత ఎన్నో ఒత్తిళ్లు? ఆటంకాలు.. చివరకు రాష్ట్రం వచ్చింది. ఒంటరి పోరాటం చేశాం. 63 స్థానాలతో గెలుసొచ్చాం. పద్నాలుగు సీట్లలో వెయ్యి ఓట్లతో తేడాతో ఓడిపోయా మన్నారు .
ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ సీఎల్పీ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు సీఎం కేసీఆర్. ”జానా గారూ.. రాష్ట్రం భ్రష్టుపట్టడం లేదు. కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పడుతోంది. మాకు వేరే నీతి లేదు? ‘ఆకు పచ్చ తెలంగాణ’? ‘బంగారు తెలంగాణ’ కావలసిందే. అదే మా నీతి. ఆ నాడు టీఆర్‌ఎస్ ను చీల్చి పది మంది ఎమ్మెల్యేలను కలుపుకున్నప్పుడు లేని నీతి ఇవాళ ఎలా వస్తుంది. విజయశాంతి, అరవింద్ రెడ్డిలను కలుపుకున్నప్పుడు విూ నీతి ఎక్కడికి పోయింది. తెలంగాణలో రాజకీయ స్థిరత్వం రావొద్దా? మేము మొహమాటం పడదలుచుకోలేదు. సమైక్యవాదుల కుట్రల నుంచి బయటపడ్డ తెలంగాణ.. మళ్లీ వాళ్ల చేతిలోకి పోవొద్దు. రక్షణ కవచంగా తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ ను భావిస్తున్నారు. దేశం ముందు తెలంగాణ నిలిచి గెలవాలి. అందరం ఏకమవుదాం. ఇది చిల్లరమల్లర రాజకీయ చేరికలుగా నేను చూడటం లేదు. రాజకీయ, ఆర్థిక సుస్థిరత సాధించాలని చెబుతున్నాను. చరిత్రలో చూడని విజయాలు సాధిస్తున్నాం. ప్రజలు తేలిగ్గా ఓట్లెయ్యరు. చరిత్రలో ఏ పార్టీ చేయని సాదాబైనామా భూములకు ఆర్వోఆర్ లు ఇస్తున్నాం. ఇంకా పెరుగుతున్నాయి. ఇంకో వారం రోజులు పెంచమని అధికారులకు చెప్పాను. లక్ష మందికి పట్టా భూములు ఇచ్చాం. చరిత్రలో ఎవరూ చేయలేని పనులు చేస్తున్నాం”.
రవీంద్రనాయక్ చేరికపై కేసీఆర్?
దేవేరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తనకు తానుగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తన చేరికపై కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. దేవరకొండకు మంచి నీళ్లు వస్తున్నాయి. భారత దేశంలో తొలి ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్(యూఎంపీపీ) అక్కడికి వస్తోంది. అభివృద్ధిని చూసే తనకు తానుగా నిర్ణయం తీసుకున్నారు. వివేక్ ఇంట్లో ప్రెస్ విూట్ లో ఈ విషయాన్ని తనకు తానుగా చెప్పారు. అప్పటి వరకు నాకే ఆ విషయం తెలియదు. ప్రభుత్వ పనితీరు బాగుందనే ఉద్దేశంతో జువ్వాడి సోదరులు పార్టీలో చేరారు” అని అన్నారు.
సుఖేందర్ తో అనుబంధం ఈనాటిది కాదు?
”ఎంపీ గుత్తా సుఖేందర్ తో నా అనుబంధం ఇప్పటిది కాదు. 1996లో ఆదిలాబాద్ లో ఒక ఉపఎన్నికకు వెళ్లినప్పుడు? ముస్లిం బస్తీలో ప్రచారం చేశాం. అక్కడి నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు చూశాం. అప్పుడు గుత్తాతో నేనో మాట అన్నాను.. నాగార్జున సాగర్ వైష్ణవాలయంలా ఉంటే.. శ్రీరాం సాగర్ శివాలయంలా ఉందన్నాను. ఎస్సారెస్పీ చిలుం పడుతోంది. అయినా పట్టించుకున్నవాడే లేడు. అప్పుడే తెలంగాణ మాలో రగులుకుంది. స్థానిక సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ నాతో దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తే? ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు న్యాయం జరగదు. మళ్లీ ఉద్యమం వస్తుంది. తెలంగాణ దుఃఖం వందేళ్లది. గడీల నుంచి బయటపడి పొందిన తెలంగాణ స్వేచ్ఛ? సమైక్యాంధ్రలో కలిసి నష్టపోయింది. ప్రస్తుతం ఆర్థిక ప్రగతి బాగుంది. ఒక్కో పేద కుటుంబాన్ని తట్టిలేపుతాం. పనిచేసే తత్వం ఉంది?. కోటి ఎకరాలకు సాగునీరందిస్తాం. టీఆర్‌ఎస్ కు బాసులు ఎవరూ లేరు. తెలంగాణ ప్రజలే బాసులు. ఎవరెన్ని విమర్శలు చేసినా? అదిరేది లేదు? ముందుకు పోతాం” అన్నారు సీఎం కేసీఆర్.