మీడియా ప్రతినిధులపై ట్రాఫిక్‌ పోలీసు దాడి

హైదరాబాద్‌: పాతబస్తీలో మీడియాపై ట్రాఫిక్‌ పోలీసు దాడికి తెగబడ్డాడు. బహదూర్‌పురాలో వాహనదారుల నుంచి ట్రాఫీక్‌ పోలీసులు డబ్బులు తీసుకుంటుండగా ఆదృశ్యాలను చిత్రీకరిస్తున్న ఓ ప్రైవేట్‌ మీడియా ఛానల్‌ విలేకరిపై కానిస్టేబుల్‌ ఫయాజ్‌ దాడి చేసి కెమెరాను లాక్కున్నాడు. విలేకరిపై ఫయాజ్‌రెచ్చి పోతున్నా అక్కడే ఉన్న ఎస్సై అంజనేయులు తనకేమి పట్టనుట్టుగా చూస్తూ కూర్చున్నారు. ఫయాజ్‌కెమెరా తీసుకుని పరారయ్యాడు. దీంతో ఆ విలేకరి బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.