ముంపు ప్రాంతాలలో పర్యటించిన నందికంటి శ్రీధర్.
మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 21
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు సకాలంలో చేపట్టాలని మేడ్చల్ మల్కాజిగిరి
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ సూచించారు.ఎగువ నుంచి వస్తున్న భారీ వర్షం నీరు బండ చెరువులోకి చేరడంతో చెరువు పొంగి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇండ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,ఈ విషయాన్ని తెలుసుకొని బండ చెరువు,ఈస్ట్ ఆనంద్ బాగ్,షిరిడి నగర్,ఉప్పరి గూడ ప్రాంతాల్లో ఆయన పర్యటిచరు. వర్షాకాలంలో బండ చెరువు దిగువ ఉన్న కాలనీవాసులు వరద సమస్యతో నిద్రలేని రాత్రులు గడపాల్చి వస్తుందని దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు ఆయనను కోరారు.
సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.వర్షాకాలంలో కాలనీలు నీట మునగకుండా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న పాలకులు కాలనీల ముంపు సమస్య పరిష్కరించ లేకపోయారని అన్నారు. పాలకులు ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్పా బయటకు రావద్దని, కరెంటు స్తంబాలకు,డ్రైనేజీ గుంతలకు దూరంగా ఉండాలని ఉన్నారు.బండ చెరువు పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటువైపు వెళ్ళకూడదని కోరారు.విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి ముందస్తు సమాచారం అందించాలని అన్నారు.అందుబాటులో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సహయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమేష్ సింగ్,బికే శ్రీనివాస్,సూర్య ప్రకాష్,శ్యామ్ రావు,ప్రవీణ్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.