ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ

హైదరాబాద్‌: జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యంపై ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లకు సంబంధించి దస్తాలను సభావతి ఎదుట ఉంచాలని డిమాండ్‌ చేసిన ఆయన, టెండర్లలో అవకతవకలు జరగడం వల్లే దస్త్రాలు సభావతి ఎదుట ఉంచేందుకు ప్రభుత్వం వెనకాడుతోందని ఆరోపించారు. పోలవరం టెండర్లను అన్ని పార్టీలు పరిశీలించిన తర్వాత ఆర్హత ఉన్న వారికే టెండర్‌ అవకాశం ఇవ్వాలన్నారు. టెండర్లనే పారదర్శకంగా నిర్వహించి ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని ఆయన సూచించారు. పోలవరం, ప్రాణహిత- చేవెళ్లకు జాతీయ హోదా సాధించడంలో సర్కారు విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు.