ముఖ్యమంత్రి పదవిని కోరుకోవటం లేదు:జానారెడ్డి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి పదవిని కోరుకోవటం లేదని కాంగ్రెస్‌నేత జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటమే ముఖ్యమని రాష్ట్రపతి ఎన్నికను తెలంగాణకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రజా సంఘాల జేఏసీ ఆయనను కలసి విన్నవించింది. అయితే దీనిపై తాము ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై నాకు ఏలాంటి సంకేతాలు అందలేవని అన్నారు.