ముగిసిన ‘ ట్విన్నింగ్ ప్రోగ్రాం-2012’
రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో
అబ్దుల్లాపూర్‌మెట్: మెరుగైన విద్యా ప్రమాణాలే లక్ష్యంగా రమాదేవి పబ్లిక్ స్కూల్, సింగపూర్‌కు చెందిన యూనిటీ సెకండరీ స్కూల్‌లు సంయుక్తంగా ‘ ట్విన్నింగ్ కార్యక్రమం – 2012 ‘ నిర్వహించాయి. కార్యక్రమంలో భాగంగా రమాదేవి పాఠశాల విద్యార్థులు, సింగపూర్ విద్యార్థులు వారం రోజులపీటు వివిధ విద్యా సంబంధిత కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. శుక్రవారంముగింపోత్సవం సందర్భంగా భారతీయ, సింగపూర్ సంస్కృతులను ప్రతిబింబించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రమాదేవి పబ్లిక్‌స్కూల్ ప్రిన్సిపల్ మారుతీ రాంప్రసాద్, ట్వీన్నింగ్ ప్రోగ్రాం ఇంఛార్జి, సింగపూర్ ప్రతినిధి అరుల్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు. యూనిటీ సెకండరీ స్కూల్ ప్రతినిధులు గ్లాడిన్, టిఫెన్‌లతో పాటురమాదేవి పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇరు దేశాల మైత్రి సంబంధాలను, మెరుగైన విద్యాప్రమాణాలను నెలకొల్పేందుకు ట్విన్నింగ్ ప్రోగ్రాంను ముందుకు తీసుకువెళ్తామని ఇరు పాఠశాలల ప్రతినిధులు తెలియజేశారు.