ముగిసిన తెదేపా తెలంగాణ ఎమ్మెల్యేల సమావేశం

కరీంనగర్‌: అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. కరీంనగర్‌ జిల్లాలోని రేగడిమత్తికుండలో ఈ రోజు జరిగిన సమావేశానికి ఎంపీ రమేష్‌ రాథోడ్‌తోపాటు పది మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు. కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. అఖిలపక్షంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగిందని చెప్పారు. సమావేశానికి ఎంతమంది వెళ్లినా ఒకే అభిప్రాయం చెప్తామని వెల్లడించారు.