ముగిసిన తెలంగాణ, కాంగ్రెస్‌ మంత్రుల సమావేశం

హైదరాబాద్‌:ఉపముఖ్యమంత్రితో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు, మంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణ కవాతు సందర్భంగా చోటు చేసుకున్న  పరిణామాలపై నేతలు చర్చించారు., తెలంగాణ సాధన కోసం త్వరలో పూర్తిస్థాయి కార్యాచరణను సిద్ధం చేస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు తెలియజేశారు. ప్రత్యేక రాష్ట్ర  ఏర్పాటు కోసం మంత్రులందరినీ కలుపుకొని ముందుకెళ్తామన్నారు. కవాతు, పరిణామాలపై వాస్తవ విషయాలను అధిష్ఠానానికి నివేదిస్తామని, రాజీనామాల అంశాన్ని త్వరలో వెల్లడిస్తామని అన్నారు.