ముగిసిన బ్రజేష్ అంత్యక్రియలు
న్యూఢిల్లీ: తొలి జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రా అంత్యక్రియలు సోమవారమిక్కడ నిర్వహించారు. స్థానిక లోఢీ రహదారిలోని విద్యుత్తు శవ దహన వాల వద్ద బ్రజేష్ కుమారుడు రాకేశ్ మిశ్రా అంతిమ నవాళులర్పించారు. ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ తదితరులు బ్రజేష్ అంత్యక్రియలకు హాజరయ్యారు



