ముదిరాజుల సింహ గర్జన సభ విజయవంతం చేద్దాం…
బిఎస్పి కొత్తపల్లి.కుమార్….
నాగర్ కర్నూల్ ఆర్సీ సెప్టెంబర్ 30(జనంసాక్షి):అక్టోబర్ 9వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యులు
కాన్షిరాం 17వ వర్ధంతి సందర్భంగా ముదిరాజ్ సింహ గర్జన సభ నిర్వహిస్తున్నట్లు ముదిరాజ్ మహాసభ నాయకులు తెలిపారు.ఈసందర్భంగా బిఎస్పీ జిల్లా పార్టీ ఆఫీస్ లో గోడ పత్రికలు విడుదల చేశారు.ఈకార్యక్రమంలో వారు మాట్లాడుతూ,ముదిరాజ్ లను(భిసీ-డి)గ్రూప్ నుండి(భిసి-ఏ)లోకి మార్చాలని,ముఖ్యంగా ముదిరాజ్ లను ఏండ్ల తరబడి రాజకీయ అధికారానికి దూరం చేస్తున్న రాజకీయ పార్టీలపై రానున్న ఎన్నికల్లో సమర శంఖం పూరించడానికి ముదిరాజ్ సింహ గర్జన సభ నిర్వహిస్తున్నామని అన్నారు.పార్టీలకు అతీతంగా ముదిరాజ్ కులస్థులు సింహగర్జన సభకు తరలి రావాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ నాయకులు సుధీర్,శ్రీహర్ష,రామస్వామి,రమేష్,గణేష్,శేఖర్,సురేష్,ప్రదీప్ మరియు బిఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి.కుమార్,మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్ మరియు లింగాల మండల బిఎస్పీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.