మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి
– ఏఐసిసి అధికారిక ప్రకటన
-ఢిల్లీకి నాలుగు పేర్లు పంపించిన పీసీసీ
-పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, కైలాష్ నేత , పల్లె రవి పేర్లను పంపిన పిసిసి
– పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతి వైపే మొగ్గుచూపిన అధిష్టానం
నల్గొండ బ్యూరో. జనం సాక్షి.
మునుగోడు నియోజకవర్గంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి పేరు ప్రతిష్టలు, గతంలోను పోటీ చేసి మంచి ఓట్లు సాధించిన స్రవంతి.ఐదు సార్లు గెలిచిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు తన కూతురికి బలం
గోవర్ధన్ రెడ్డి(1967). పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. (కాంగ్రెస్)
(1972) పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్)
(1978) పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్)
(1983). పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. (కాంగ్రెస్)
(1999) పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. (కాంగ్రెస్)
స్రవంతికి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులు
కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా సిపిఐ కి మద్దతు తెలపడంతో ఆశించిన టికెట్టు దక్కకపోవడంతో మొదటిసారిగా 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసారు.పాల్వాయి స్రవంతికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో 27,431 ఓట్లు వచ్చాయి.
2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు టికెట్ ఆశించడంతో స్రవంతి స్వచ్ఛందంగానే పోటీ నుంచి తప్పుకుని ఆయన గెలుపు కోసం పనిచేశారు. ముఖ్యంగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి మెజార్టీ నేతల అభిప్రాయం మేరకు మునుగోడు ఉపఎన్నికలో పాల్వాయి స్రవంతికే అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. దీంతో స్రవంతి వర్గం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది.