మెడికల్ కాలేజీ పేరులో తప్పులను సరి చెయ్యండి.

  – మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా.
జనం సాక్షి ప్రతినిధి  కొత్తగూడెం:  జిల్లాలో నూతనంగా ప్రారంభంకానున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉర్దూ లో వ్రాయించిన పేరులో గల తప్పులను సరి చెయ్యాలని మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా శనివారం నాడు ఒక ప్రకటనలో అధికారులను కోరారు. మెడికల్ కాలేజీ పేరులో జిల్లా  పేరు భద్రాద్రి కొత్తగూడెం’ అని వ్రాయవలసి ఉండగా ‘భద్రద్రి కొట్టగూడెం’ అని తప్పుగా వ్రాయించారని, మెడికల్ విద్యను బోధించే, బోధనా కాలేజీ  పేరు తప్పులు తడకలుగా వ్రాయించి ఉర్దూ భాషను అపహాస్యం చేస్తున్నారని, కావున అధికారులు వెంటనే స్పందించి, భద్రద్రి కొట్టగూడెం’ను ” సరి చెయ్యాలని సూచించారు.