మెదక్‌ రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

మెదక్‌: నర్సాపూర్‌ మండలం పెద్దచింతకుంట వద్ద జరిగిన రోడ్డుప్రమాదం లో నలుగురు మృతి చెందారు. కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన ఉస్మాన్‌, బాబా, హైమద్‌, శ్రీనివాన్‌లు హైదరాబాద్‌ వెళ్లి మంగళవారం అర్థరాత్రి తిరిగి వస్తుండగా మెదక్‌ నర్సాపూర్‌ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న క్వాలిన్‌ వాహనం ఎదురుగా వస్తున్న లారీని డీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చురుకున్న పోలీసులు మృతదేహలను నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.