మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఏకగ్రీవం

C

– బొంతు రామ్మోహన్‌, బాబా ఫసియుద్దీన్‌ ఎన్నిక

హైదరాబాద్‌,ఫిబ్రవరి 11(జనంసాక్షి):గ్రేటర్‌ హైదరాబాద్‌ కొత్త మేయర్‌గా బొంతు రామ్మోహన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌

సమావేశంలో మేయర్‌గా రామ్మోహన్‌ను, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన టీఆర్‌ఎస్‌

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు రెండింటినీ కైవసం చేసుకుంది. జీహెచ్‌ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ 99 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం జీహెచ్‌ఎంసీ సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రిసైడింగ్‌ అధికారి రాహుల్‌ బొజ్జా కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల చేత  ప్రమాణ స్వీకారం చేయించారు. కార్పొరేటర్లు నాలుగు భాషల్లో ప్రమాణం చేశారు. అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. మేయర్‌గా చర్లపల్లి కార్పొరేటర్‌ బొంతు రామ్మోహన్‌ పేరును వెంకటేశ్వర కాలనీ

కార్పొరేటర్‌ మన్నె కవిత ప్రతిపాదించగా, విూర్‌ పేట్‌ కార్పొరేటర్‌ అంజయ్య బలపరిచారు. మేయర్‌, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన అనంతరం బొంతు రామ్మోహన్‌,బాబా ఫసియుద్దీన్‌లు సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్‌ వారిని అభినందించారు.మేయర్‌ పదవికి ఇతరులెవరూ పోటీపడకపోవడంతో రామ్మోహన్‌ ఏకగ్రీవంగా

ఎన్నికయ్యారు. ఇక డిప్యూటీ మేయర్‌గా బోరబొండ కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌ పేరును అవిూర్‌ పేట్‌ కార్పొరేటర్‌ శేషుకుమారి ప్రతిపాదించగా, రాంనగర్‌ కార్పొరేటర్‌

శ్రీనివాసరెడ్డి బలపరిచారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు ప్రకటించింది.

రేపు మేయర్‌గా బాధ్యతలు

హైదరాబాద్‌ గ్రేటర్‌ మేయర్‌గా బొంతు రామ్మోహన్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. రేపు మధ్యాహ్నం 12.40గంటల ప్రాంతంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ

కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ¬మంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు హాజరుకానున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ కొత్త మేయర్‌గా బొంతు రామ్మోహన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. గురువారం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశంలో మేయర్‌గా

రామ్మోహన్‌ను, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన టీఆర్‌ఎస్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌

పదవులు రెండింటినీ కైవసం చేసుకుంది. జీహెచ్‌ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ 99 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

కొత్త మేయర్‌ నేపథ్యం ఇదీ

ఆది నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతోపాటు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెన్నంటి ఉన్న బొంతు రామ్మోహన్‌ పేరు మేయర్‌ పదవికోసం మొదటినుంచి ప్రముఖంగా వినిపించింది.ఆ క్రమంలోనే నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరూ బొంతు రామ్మోహన్‌ పేరును ప్రతిపాదించారు. మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన రామ్మోహన్‌ తెలంగాణ ఉద్యమం తొలినాళ్ల నుంచి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ కు ఆసాంతం అంగరక్షకుడిలా వెన్నంటి ఉన్నాడు. మేయర్‌ గా రామ్మోహన్‌ ను ఎంపిక చేయటం సముచితం అని పార్టీలో ఎక్కువమంది అభిప్రాయపడినట్టు తెలిసింది. విద్యావంతుడు, యువకుడైన రామ్మోహన్‌.. టీఆర్‌ఎస్‌లో చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. 2001 నుంచి ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ అనేకమార్లు జైలుకెళ్లారు. ఉద్యమం సందర్భంగా ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. పార్టీలో సైతం క్రియాశీలంగా వ్యవహరిస్తూ సభల నిర్వహణలో ముఖ్యభూమిక పోషించారు. ఈ క్రమంలోనే పార్టీ ఆయనను గ్రేటర్‌ ఎన్నికల్లో చర్లపల్లి డివిజన్‌ నుంచి బరిలోకి దించింది.పేరు: బొంతు రామ్మోహన్‌హైదరాబాద్‌: గ్రేటర్‌ మేయర్‌గా పదవి

చేపట్టిన బొంతు రామ్మోహన్‌ సాధారణ కుటుంబంలో జన్నించి అంచెలంచెలుగా ఎదిగారు. వరంగల్‌ జిల్లా కురవి మండలం నేరడకు చెందిన  బొంతు వెంకటయ్య, కమలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఏకైక కుమారుడు రామ్మోహన్‌. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆమనగల్‌లో చదువుకున్న ఆయన ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు కురవి మండలం నేరడలో పూర్తి చేశారు. ఆ తర్వాత మానుకోటలోని కంకరబోడ్‌ హైస్కూల్‌లో 9వ తరగతి, ఎస్సెస్సీ, జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. ఇక జిల్లా కేంద్రంలోని ఆదర్శ కళాశాలలో డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ చదివిన రామ్మోహన్‌, ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. హైదరాబాద్‌ అవిూర్‌పేటకు చెందిన జంగాల శ్రీదేవిని వివాహం చేసుకున్న రామ్మోహన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

తొలుత ఏబీవీపీలో..

తొలుత ఏబీవీపీలో పనిచేసిన బొంతు రామ్మోహన్‌ 2002లో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా, పార్టీకి విధేయుడిగా ఉన్న ఆయన క్రియాశీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చర్లపల్లి డివిజన్‌ నుంచి ఆయన కార్పొరేటర్‌గా ఎన్నిక కాగా, పార్టీకి చేసిన సేవలను గుర్తించి మేయర్‌ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ ఎంపిక చేశారు. ఈ విషయం తెలియగానే అటు కురవి, ఇటు మానుకోట మండలాలతో పాటు జిల్లావ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు చదువుకున్న వారు, టీఆర్‌ఎస్‌ నాయకులు పలువురు రామ్మోహన్‌ ఎంపికపై హర్షించారు. మహబూబాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ హరికోట్ల రవి మాట్లాడుతూ రామ్మోహన్‌తో కలిసి తాను ఉస్మానియాలో పీజీ చదువుకున్నానని గుర్తు చేశారు. చదువుకునే సమయంలో విద్యార్థుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించేవారని తెలిపారు.

జన్మదినం: 5 జూన్‌, 1973

తండ్రి: బొంతు వెంకటయ్య

తల్లి: బొంతు కమలమ్మ

విద్యార్హత: ఎల్‌ఎల్‌బీ(వరంగల్‌), ఎంఏ ఎల్‌ఎల్‌ఎం(పీహెచ్‌డీ) ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌

జన్మస్థలం: నేరడ

మండలం: కొరివి

జిల్లా: వరంగల్‌

వివాహం: 2004లో జంగాల శ్రీదేవి యాదవ్‌(ఎంఏ, బీఈడీ)

సంతానం: ఇద్దరు కూతుళ్లు. బొంతు కూజిత(9 సం.), బొంతు ఉషశ్రీ(5 సం.)

తాజావార్తలు