మొక్కలతో కాలుష్య నివారణ

విజయనగరం, జూలై 30 : పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడానికి మొక్కలు పెంపకమే శరణ్యమని ఆశయ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు రెడ్డి రమణ అన్నారు. చీపురుపల్లి ప్రెస్‌క్లబ్‌ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాగృతి కార్యక్రమంలో భాగంగా ప్రతి చోటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యుడు ఎస్‌. శ్రీరాం, అప్పలరాజు, కనకరాజులు పాల్గొన్నారు.