మోపిదేవి బెయిల్ పిటిషన్ వాయిదా
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన మోపిదేవి వెంకటరమణ బెయిల్‌పిటిషన్ విచారణను సీబీఐ న్యాయస్థానం ఈ నెల 9కి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్‌పై మోపిదేవి తరపు న్యాయవాది, సీబీఐ న్యాయవాదులు తమ వాదనలు ముగించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 9కి వాయిదా వేశారు.



