మోహన్‌బాబు నివాసం వద్ద బ్రాహ్మణుల ఆందోళణ

హైదరాబాద్‌: ‘దేనికైనరెడీ’ చిత్రంపై బ్రాహ్మణసంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆందోళన చేస్తున్న బ్రాహ్మణ సంఘాల కార్యకర్తలపై మోహన్‌బాబు నివాసం వద్ద ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బంది దాడికి దిగారు.  చిత్రంలోని కొన్ని  సన్నివేశాలను తొలగించాలని  బ్రాహ్మణ సంఘ ప్రతినిథులు డిమాండ్‌ చేశారు. ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది దాడిలో కొందరు గాయపడటంతో వీరిని ఆసుపత్రికి తరలించారు.