`యాదాద్రిని దర్శించిన సిఎస్ సోమేశ్ కుమార్
ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన
యాదాద్రి భువనగిరి,నవంబర్19(జనం సాక్షి ) :
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ బి.నర్సింహామూర్తి లడ్డూ ప్రసాదం అందజేశారు. అంతకు ముందు సీఎస్‌కు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆలయ ఈవో ఎన్ గీత, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.