యాసిడ్‌ ట్యాంకులో పడి కార్మికుడి మృతి

విశాఖ: విశాఖపట్నం జిల్లా గాజువాకలోని ఓ ఫ్లోరైడ్‌ కంపెనీలో యాసిడ్‌ ట్యాంకులో పడి కార్మికుడు మృతిచెందాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.