యూపీలో గ్రామ పంచాయితీ ప్రత్యేక సంచలన చట్టాలు

లక్నో : స్త్రీలు మొబైల్‌ ఫోన్లు వాడకూడదు, ప్రేమ వివాహలు చేసుకోకుడదు, ఒక వేళ చేసుకున్న ఆ ఉళ్లో ఉండకూడదు. ఎక్కడికైన వెళ్లిపొవాలి. నలబై ఏళ్లలోపు మహిళలు పురుషులు తోడు లేకూండా బజారుకు వెళ్లకూడదు. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తలమీద నుంచి కొంగు కప్పుకొవాలి. ఇవన్నీ ఎక్కడో కాదు  దేశ రాజదానికి 50 కి.మీ ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామ పెద్దలు తిసుకున్న నిర్ణయాలు. వీటికి గ్రామ ప్రజలు అంత అమోదముద్ర వేశారు. ఈ గ్రామం పౌరవిమానయాశాఖ మంత్రి అజిత్‌ సింగ్‌ నియోజక వర్గంలో ఉండడం మరో విశేషం. ఇక్కడ కొన్ని నియామాలు పురుషులకు కూడా ఉన్నాయి. యువకులు చెవుల్లో హెడ్‌ఫోన్లు పెట్టుకోని తిరగకూడదు. వీటన్నిటికీ తోడు వీరు తిసుకున్న మరో ముఖ్యమేన నిర్ణయం వరకట్నం ఇవ్వడం, తీసుకొవడం నేరం. అందుకు కఠిన శిక్ష ఉంటుందని గ్రామ పెద్దల పంచాయితీ హెచ్చరించింది. ఈ పంచాయితీ  నిర్ణయాల విషయంలో తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరిపి నివేదిక పంపవాలిసిందిగా స్థానిక అధికారులకు బాగవత్‌ పోలిసు సూపరింటెండెంట్‌ తెలిపారు.