యూరియా కొరత తీర్చాలని కోరుతూ జేడిఏ చాంబర్ ఎదుట ఎమ్మెల్యే బైఠాయింపు
ఖమ్మం: యూరియా కొరత తార్చాలని కోరుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం సాయంత్రం ఖమ్మంలోని జేడిఏ ఛాంబర్ ఎదురుగా బైఠాయించారు. రైతులు యూరియా కొరతను ఎదుర్కొంటున్నా ప్రభుత్వం ఎందుకు సరఫరాచేయటం లేదని జేడిఏ రఫీఅహ్మద్‌ను నిలదీశారు.



