రసాభాసగా మండల సర్వసభ్య సమావేశం

share on facebook

*అధికారులుపై ప్రజా ప్రతినిధులు ఆగ్రహం,
* స్టాఫ్ నర్స్, హెల్త్ అసిస్టెంట్,ఆశ వర్కర్ ను విధుల నుంచి తొలగించాలి,
* రెవిన్యూ శాఖపై సభ్యులు ఆగ్రహం,
* 24 శాఖలకు 8 శాఖలు నివేదికలు సమర్పించారు,
* మిగతా శాఖల పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ,
ఖానాపురం జనం సాక్షి

మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావుఅధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా కొనసాగింది. మండలంలో నెలకొన్న సమస్యలపై సభ్యులు అధికారులను నిలదీశారు. మొదటగా వ్యవసాయ శాఖ పై మండల వ్యవసాయ శాఖ అధికారి భోగ శ్రీనివాస్ నివేదికను చదివి వినిపించారు. పలువురు ప్రజా ప్రతినిధులు మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్ ను గత సంవత్సరం పంట నష్టపోయిన రైతులకు నేటివరకు పరిహారం అందలేదని వారు తేలిపోవడంతో ఇట్టి విషయాన్ని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఏవో తెలిపారు.
పశువర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీ లక్ష్మి వారి నివేదికను చదివి వినిపించారు. విద్యాశాఖ అధికారి సంపత్ నివేదికలు వినిపిస్తుండగా కి ర్య తండ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఒకరిద్దరు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతోగ్రామంలోని మొత్తానికి కరెంట్ ఎలా కట్ చేస్తారు అని విద్యుత్ అధికారులు నిలదీశారు. మండలంలో 20 గ్రామ పంచాయతీల పరిధిలోని రేషన్ డీలర్లు సన్నబియ్యం ఉన్నా కూడా సన్న బియ్యం ఇవ్వకుండా దొడ్డు బియ్యం ఉన్నారని తాసిల్దార్ సుభాష్ నికి పలువురు ఫిర్యాదు చేశారు. అలాగే వివిధ శాఖల అధికారులు నివేదికను చదివి వినిపించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుమన వాణి, తాసిల్దార్ సుభాషిని, వైస్ ఎంపీపీ ఉమారాణి ఉపేందర్రెడ్డి, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.