రాజాపూర్ తెలుగు వార్డు విఘ్నేశ్వరుని దగ్గర అన్నదాన కార్యక్రమం

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 7 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో తెలుగు వార్డులో  విగ్నేశ్వరుని దగ్గర యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ముందుగా విఘ్నేశ్వరునికి మొక్కలు తీర్చుకొని తీర్థప్రసాదాలు తీసుకున్న తదనంతరం యువతీ యువకులు ఈ అన్నదాన  కార్యక్రమంలో    ఉత్సాహంగా పాల్గొని ప్రజలకు అన్నాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో వినాయక యువజన సంఘ సభ్యులు  ప్రజలు యువతీ యువకులు పాల్గొన్నారు.