రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తాం

విజయనగరం: రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర శాసనసభలో ఒక రోజు చర్చలు చేపట్టనున్నట్లు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.1740 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. మరో 5 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు.