రాష్ట్రపతికి కేంద్ర హోంశాఖ తెలంగాణ వ్యతిరేక నివేదిక ఇవ్వలేదు

స్పష్టం చేసిన చిదంబరం

న్యూఢిల్లీ, జూలై 31 (జనంసాక్షి):
తెలంగాణ అంశం పై నూతన రాష్ట్రపతి ప్రణబ్‌ కు కేంద్ర హోంశాఖ వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిందన్న వార్తను హోమంత్రి పి. చిదంబరం తీవ్రంగా ఖండించారు. మంగళవారం నాడు న్యూఢిల్లీ లో ఆయన మీడియాతో మాట్లడుతూ హోంశాఖ ఎలాంటి నివేదికలు రాష్ట్రపతికి ఇవ్వదని అలా ఇవ్వవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రన్ని ఏర్పాటు చేసే అధికారం కేంద్ర కేబినెట్‌కు మాత్రమే ఉందని రాష్ట్రపతికి లేదని అలాంటప్పుడు రాష్ట్రపతికి నివేదిక ఇవ్వవలసిన అవసరం ఏముందని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ఇది కేవలం ఊహజనితం అయిన నిరాధార మైన వార్తగా చిదంబరం కోట్టి పారేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రానికి హోంశాఖ నివేదిక ఇవ్వడం సీమాంధ్ర మీడియా చేసిన ప్రచారమేనని తేలి పోయింది.