రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతివ్వం:నారాయణ

గుంటూరు:రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతివ్వమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు.రాష్ట్రంలో మద్యం మాఫియా మంత్రులను కాపాడేందుకు నిజాయితీ గల అధికారులను బదిలీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తమిళనాడు గవర్నర్‌ రోశయ్య పదవీకి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని డిమాండ్‌ చేశారు.అమీర్‌పేట భూముల కేసులో రోశయ్య సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.