రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈనెల 17న ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలూ సమావేశమవుతాయి. ఈ మేకు గవర్నర్ శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాలు ఐదు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. దీనిలో ముఖ్యంగా బోధనా రుసుముల వ్వవహారం, విద్యుత్తు, రైతుల సమస్యలపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అయితే సెప్టెంబరు 17న తెలంగాన వమోచన దినం కావడంతో తెలంగాన అంశాన్ని కూడా రాజకీయ పార్టీలు ప్రస్తావించే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ ఉపప్రణాళికపై చర్చ జరిగేందుకు తక్కువ అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.



