రిగ్గు యజమానులు దరఖాస్తు చేసుకొండి

నిజామాబాద్‌, జూలై 10 : జిల్లాలోని వివిధ మండలాల్లో 49 బోరుబావులు (ఫీజోమీటర్లు) వేసేందుకు వాల్టా చట్టం కింద నమోదు చేయించుకున్న డిటిహెచ్‌ రిగ్గు యజమానులు ఈ నెల 13వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మధ్యాహ్నం 3గంటల వరకు బిడ్‌ సమర్పించాలని, బిడ్‌ ఫారములు కార్యాలయ పనివేళ్లలో ఉచితంగా ఇస్తామని భూగర్బ జల శాఖ ఉప సంచాలకులు మంగళవారం నాడు తెలిపారు. ఇతర వివరాలకు ఈ ఫోన్‌ నంబర్లో సంప్రదించాలని కోరారు.సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్‌ 08462241437.