రుద్రంగి లయన్స్ క్లబ్ ఆధ్వర్యములో మట్టి వినాయకుల పంపిణి

రుద్రంగి ఆగస్టు 31 (జనం సాక్షి)
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉత్సాహంగా వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకొనుటకు వీలుగా రుద్రంగి లయన్స్ క్లబ్ ఆధ్వర్యములో భక్తులకు మట్టి గణపతులను అందించడం జరిగిందని లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ కర్ణవత్తుల దేవేందర్ రావు అన్నారు.భక్తులు ప్రతి సంవత్సరం ఉత్సాహంగా గణపతులు ఏర్పాటు చేస్తున్నప్పటి ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారు చేసినవిగ్రహాల వల్ల జలకాలుష్యం అవుతుందని, కాలుష్యం లేకుండా ఈ మట్టి ప్రతిమలతో ఏర్పాటు చేసుకోవడం వల్ల మన వంతుగా పర్యావరణాన్ని కాపాడిన వారం అవుతామని 320 జి లయన్స్ జిల్లా క్యాబినెట్ మెంబర్ లయన్ తీపిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.పర్యావరణ పరిరక్షణ అనేది మననుండే ప్రారంభం కావాలని లయన్స్ క్లబ్ సభ్యులందరికి ఇంటింటికి వెళ్లి మట్టి వినాయకుడిని లయన్ తీగల శశిధర్ రావు అందించారు.ఈ కార్యక్రమములో క్లబ్ సెక్రటరీ లయన్ గోడికర్ హీరోజీ,ట్రెజరర్ సుడిగేపు పర్శరాములు,లయన్స్ క్లబ్ భాద్యులు లయన్ గడప రఘుపతి రావు,లయన్ మంచె రమేష్, లయన్ మంచె రాజేశం,లయన్ మాడిశెట్టి ప్రభాకర్, లయన్ కోటగిరి శ్రీనివాస్ మరియు భక్తులు పాల్గొన్నారు.