రెండవపెళ్లి చేసుకున్న మహిళపై గ్రామస్థుల దాడి
కరీంనగర్: పెళ్లి జరిగి ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళపై గ్రామస్థులు దాడికి పాల్పడిన సంఘటన ధర్మారం మండలంలోని చామనపల్లిలో జరిగింది. చామనపల్లికి చెందిన వేల్పుల మల్లయ్యకు పదేళ్ల క్రితమే పెళ్లి జరగాగ ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య కలతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో భార్యకు తెలియకుండా రెండురోజులక్రితం జలజల అనే యువతిని రెండవ వివాహం చేసుకున్నాడు, మంగళవారం రాత్రి రెండవ భార్య, వారి ఆత్తమామలతో కలిసి మొదటి భార్య రమపై దాడికి పాల్పడ్డారు. దీంతోతనకు న్యాయం చేయాలని మొదటిభార్య రమ గ్రామ పెద్దలను ఆశ్రయించింది. రమ భర్తను మిగిలిన వారిని గ్రామ పెద్దలు పిలిపించారు. రెండవ భార్యను పంపేయాలని సూచించారు. వారు వినకపోవటంతో చెట్టుకు కట్టేసేందుకు ప్రయత్నించారు. రెండవ భార్య తప్ప భర్త, మిగిలినవారు పారిపోయారు. ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈలోగా పోలీసులు వచ్చి ఆమెను విడిపించి ఠానాకు తరలించారు.