రెండు వర్గాల మధ్య ఘర్షణ….18 మందికి గాయాలు

వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని నిమ్మలబజార్‌లో ఈ రోజు ఉదయం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ  ఉద్రిక్తతకు దారితీసింది.  ఇరువర్గాలు కత్తులు, గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో 18 తీవ్రంగా గాయపడ్డారు. వీరికి చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడేళ్ల క్రితం  ప్రేమ వ్యవహారంలో తలెత్తిన వివాదమే ఈ ఘర్షణలకు కారణమని తెలుస్తోంది.