రెండో రౌండ్‌లో సెరీనా

మహిళల సింగిల్స్‌ టెన్నిస్‌ పోటీల్లో అమెరికా స్టార్‌ సెరీనా విలియమ్స్‌ రెండో రౌండ్‌లోకి ప్రవే శించింది.సెర్బియాకు చెందిన మాజీ నెం.1 జలీ నా జకోవిచ్‌ను 6-3,6-1 తేడాతో తొలిరౌండ్‌ లో సెరీనా ఓడించింది.ఆల్‌ ఇంగ్లాండ్‌ లాన్‌ టెన్నిస్‌ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తమ దేశ క్రీడాకారిణి ఆటను అమెరికా ప్రథమ పౌరురాలు మిచెల్లీ ఒబామా ప్రత్యక్ష్యంగా వీక్షించింది.ఈ నెల 7న వింబుల్డన్‌ టైటిల్‌ను కూడా సెరీనా ఈ స్టేడి యంలోనే గెల్చుకుంది.14 గ్రాండ్‌శ్లామ్‌ టైటిళ్లను తన ఖాతాలో వేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుం ది.సోదరి వీనస్‌తో కలిసి రెండు స్వర్ణాలను సెరీనా సాధించింది.