రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నూతన మల్టిపర్పస్ హాల్ ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి :

శామీర్ పేట్, జనం సాక్షి :
మండల కేంద్రం శామీర్ పేట్ గ్రామంలో వంగ లావణ్య నర్సిహ్మ రెడ్డి ఆధ్వర్యంలో నూతన మల్టీపర్పస్ హాల్ ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి, ఎంపీపీ ఎల్లు బాయి బాబు,షామీర్పేట్ మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్, ఏఎంసి చైర్మన్ భాస్కర్ యాదవ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్ యాదవ్, మాజీ సర్పంచ్ కిషోర్ యాదవ్, రెడ్డి సంఘం నాయకులు వెంకట్ రెడ్డి, భూమిరెడ్డి, అఫ్జల్ ఖాన్ గ్రామ పెద్దలు మహిళా సోదరీమణులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు హరివర్ధన్ రెడ్డి, వై ఎస్ గౌడ్, మహేందర్ యాదవ్, అతిధులకు శాలువాలతో సత్కరించారు.
29ఎస్పీటీ -1: హల్ ను ప్రారంభిస్తున్న మంత్రి మల్లారెడ్డి