రేపటినుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

జనం సాక్షి,వెల్దుర్తి:

మండల కేంద్రమైన వెల్దుర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దుర్గాభవాని సేవా సమితి సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయ ప్రాంగణమంతా ముస్తాబయిందని గ్రామంలోని పలు వీధులనుతా కాషాయం తోరణాలతో అలంకరించడం జరిగిందని అలాగే మండపం అంతా పలు రకాల పూలతో విద్యుత్ దీప కాంతులతో ముస్తాబు చేయడం జరిగిందని అక్టోబర్ 2న మహా చండీ హోమం నిర్వహించడం జరుగుతుందని సేవాసమితి సభ్యులు తెలిపారు దసరా రోజు రావణ దహన కార్యక్రమం మరుసటి రోజు ఉదయం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఇరుముడి కార్యక్రమం ఉంటుందని అనంతరం అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని వారన్నారు గత 19 సంవత్సరాలుగా దుర్గా భవాని సేవా సమితి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమాలను చూడటానికి సుదూర ప్రాంతాలతో భక్తులంతా అధిక సంఖ్యలో వస్తున్నట్లు వారన్నారు