రేపు కరీంనగర్‌ జిల్లాలో గవర్నర్‌ పర్యటన

కరీంనగర్‌: రేపు జిల్లాలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ పర్యటించనున్నారు. హుజురాబాద్‌, ముల్కనూర్‌, కరీంనగర్‌లలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. పోలీసులు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పట్లు చేశారు. గవర్నర్‌ పర్యటనను అడ్డుకుంటారనే  కారణంతో విద్యార్థులను, టీఆర్‌ఎస్‌, జేఏసీ, ఉద్యోగసంఘాల నాయకులను అరెస్టు చేస్తున్నారు.