రేపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జస్ చార్జీల పెంపునకు నిరసన
హైదరాబాద్: ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రేపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. అన్ని కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.



